పిల్లల చదువుల కోసం LIC నుండి సూపర్ స్కీమ్.. పూర్తి వివరాలు ఇవే..!

-

చాలా మంది ఈ మధ్య కాలంలో ఎవరికి నచ్చిన పథకాల్లో వాళ్ళు డబ్బులని పెడుతున్నారు. ఇలా స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిగా డబ్బులు వస్తాయి. రిస్క్ కూడా ఉండదు. ఈ రోజుల్లో భారతదేశంలో అనేక రకాల ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్స్‌ వున్నాయి. నచ్చిన వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కూడా బాగుంటుంది. అందుకే చాలా మంది పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది పాలసీదారులను కలిగి ఉన్న ఎల్‌ఐసీకి ఆదరణ ఎక్కువే ఉంది. వివిధ రకాల పాలసీలని అందిస్తోంది LIC. పిల్లల కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలు LIC తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా మీ పిల్లల చదువుకి ఇబ్బందే ఉండదు.

Life Insurance Corporation

చక్కగా మీ పిల్లలు చదువుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఈ పథకం పేరు ఎల్‌ఐసీ జీవన్ తరుణ్ పాలసీ. చాలా చక్కటి రాబడిని ఈ స్కీమ్ కింద పొందొచ్చు. ఎల్‌ఐసీ జీవన్ తరుణ్ పాలసీలో పెట్టుబడి పెట్టడానికి మీ పిల్లల వయస్సు 3 నెలలు, గరిష్టంగా 12 సంవత్సరాలు ఉండాలి. 20 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు దీనిలో మీరు డబ్బులు పెట్టచ్చు. ఆ తర్వాత 5 సంవత్సరాల వ్యవధి లో ఎలాంటి పెట్టుబడి ఉండదు. మీ పిల్లాడికి 25 సంవత్సరాలు నిండిన తర్వాత మొత్తం డబ్బును క్లెయిమ్ చేయవచ్చు. పిల్లల చదువులు, పెళ్లి ఖర్చుల కోసం టెన్షన్ ఏ ఉండదు. ఖచ్చితంగా కనీసం రూ.75,000 హామీ మొత్తం పొందొచ్చు.

గరిష్ట మొత్తానికి ఎటువంటి పరిమితి నిర్ణయించబడలేదు. నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక, వార్షిక ప్రాతిపదికన ప్రీమియం డిపాజిస్ట్ చేసుకోవచ్చు. జీవన్ తరుణ్ పాలసీ అనేది పరిమిత చెల్లింపు స్కీము. 12 సంవత్సరాల వయస్సులో పిల్లల కోసం ఈ పాలసీని తీసుకుంటే చిన్న మొత్తంలో రూ.150 చేస్తే వార్షిక ప్రీమియం దాదాపు రూ.54,000 అవుతుంది. 8 సంవత్సరాలలో మొత్తం రూ.4.32 లక్షలు డిపాజిట్ అవుతుంది. రూ.2.47 లక్షలు బోనస్‌ వస్తుంది. 25 సంవత్సరాల వయస్సులో సుమారు 7 లక్షల రూపాయల వస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version