మీరు ప్రతీ నెల డబ్బులని పొందాలని అనుకుంటున్నారా…? అయిత్ ఈ ప్లాన్ గురించి మీరు తెలుసుకుని తీరాలి. ఇలా మీరు ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు. అది కూడా రూ.17 వేలు. ఇలా ప్రతీ నెల మీ చేతికి వస్తాయి. అయితే మరి అసలు దీనిని ఎలా పొందాలి..? ఎంత వరకు వస్తాయి..? ఇలా అనేక విషయాలు మీకోసం. ముందు జాగ్రత్తగా భవిష్యత్ లో ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఇప్పటి నుండే డబ్బు ఆదా చేసుకోవాలని అనుకునే వారికి ఇది నిజంగా బెస్ట్ ఆప్షన్.
ఇంటర్మీడియట్ యాన్యుటీ, డిఫర్డ్ యాన్యుటీ ఇలా ఈ రెండిటిలో మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఆప్షన్ కింద వెంటనే పాలసీ తీసుకున్న వెంటనే పెన్షన్ డబ్బులు వస్తాయి. అదే డిఫర్డ్ ఆప్షన్ ని కనుక మీరు తీసుకుంటే 5, 10, 15, 20 ఏళ్లు ఇలా మీకు నచ్చినప్పటి నుంచి పెన్షన్ తీసుకోవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తంపై మీకు ఎంత వస్తుందో ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు 50 ఏళ్ల నుండి పెన్షన్ ని తీసుకుందాం అనుకుంటే.. మీకు 30 ఏళ్లు ఉన్నప్పుడు మీరు రూ.10 లక్షలు బీమా మొత్తానికి ఈ పాలసీ తీసుకున్నారు. అప్పుడు మీకు నెలకు రూ.17 వేలకు పైగా లభిస్తాయి. ఇలా జీవించే వరకు మీరు పొందొచ్చు.