విజయ్‌..లైగర్‌ సినిమా సెన్సార్‌ బోర్డు బిగ్‌ షాక్‌ !

-

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, ‘లైగర్’ ఫిల్మ్ తో పాన్ ఇండియా స్టార్ కానున్నారు. టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ పై ఫ్యాన్స్ ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. విజయ్ దేవరకొండ గత చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ పేక్ష ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ నేపథ్యంలోనే లైగర్ డెఫినెట్ గా అలరిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.

ఈ సినిమా వచ్చేవారం పేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా సెన్సార్ కు వెళ్ళింది. అయితే ఇక్కడ లైగర్ కు సెన్సార్ బోర్డు నుంచి పెద్ద షాక్ తగిలింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు 7 కట్స్ చెప్పారట.

దీనికి సంబంధించిన సెన్సార్ రిపోర్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అభ్యంతరంగా ఉన్న ఏడు సన్నివేశాల్లో కొన్ని పూర్తిగా తొలగించాలని, మరికొన్ని చోట్ల మ్యూట్ పెట్టాలని సెన్సార్ బోర్డు సభ్యులు సూచించారట. దీనిలో F*** అనే పదం ఎక్కువసార్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పదం వచ్చిన ప్రతిసారి మ్యూట్ వేయాలని కూడా సూచించారని సమాచారం అందుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version