తెలంగాణలో వలే ఆంధ్రాలో కూడా కులగణన సర్వే చేయాలి : బీసీ సంక్షేమ నాయకులు

-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించినట్లే ఆంధ్రప్రదేశ్‌లోనూ కూటమి ప్రభుత్వం కులగణన సర్వే చేయాలని అక్కడి బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం బీసీ నాయకులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

ఈ క్రమంలోనే విజయవాడ బందరు రోడ్డులో ర్యాలీ చేస్తున్న నాయకులను.. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసులు అరెస్టు చేయడం ఏంటని బీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే, ర్యాలీ నిర్వహణకు ముందస్తు అనుమతి తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. బీసీ కులగణన సర్వే చేయాలని, ఈ విషయంపై ప్రభుత్వం ఆలోచించాలని ఏపీ ప్రభుత్వాన్ని నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news