తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్ నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ రజతోత్సవం నేపథ్యంలో ప్రొ.కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి అంజలి ఘటించారు కేటీఆర్. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి సందడి చేసారు కేటీఆర్.

అటు బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో.. కేటీఆర్ ట్వీట్ చేశారు. గులాబీ జెండా 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. గులాబీ జెండాను భుజాలపై మోసిన సైనికులకు, భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతూ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు.
పార్టీ 25 ఏళ్ల రజతోత్సవ వేళ.. తొలిరోజు నుంచి.. కేసీఆర్ గారితో కలిసి కదంతొక్కిన ఉద్యమకారులకు గులాబీ జెండాను తమ భుజాలపై మోసిన సైనికులకు భాగస్వాములైన ప్రతిఒక్కరికీ పేరుపేరునా అభినందనలు చెప్పారు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీగా.. నాలుగు కోట్ల ప్రజల కోసం పునరంకితమవుదామన్నారు.