30సెంట్ల భూమి కోసం.. ట్రాక్టర్‌తో తొక్కించి తల్లిదండ్రుల్ని చంపిన కొడుకు

-

కేవలం 30సెంట్ల భూమి కోసం ట్రాక్టర్‌తో తొక్కించి తల్లిదండ్రుల్ని చంపాడో కసాయి కొడుకు.ఈ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడిపూరికల్లాలులో శనివారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.

ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులనే కొడుకు రాజశేఖర్ హతమార్చినట్లు సమాచారం. ఆస్తిలో తన చెల్లికి వాటా ఇవ్వడంతో తల్లిదండ్రులతో కొడుకు వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. ఈ క్రమంలో కక్ష పెంచుకున్న రాజశేఖర్.. ట్రాక్టర్‌తో తొక్కించి తల్లిదండ్రుల్ని చంపినట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పూసపాటిరేగ పోలీసులు వెల్లడించారు. తల్లిదండ్రుల్ని హత్య చేసిన అనంతరం కొడుకు రాజశేఖర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news