తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపారు. పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణకు ఆమోదం తెలిపారు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.

50% రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివేస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదలకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీంతో త్వరలో స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల కానుంది. అంటే త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు జరుగనున్నాయటన్న మాట.
- తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లకు లైన్ క్లియర్..
- పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం
- 50 శాతం రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివేస్తూ నిర్ణయం
- గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు గవర్నర్
అనుమతి - త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్