లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీలని అందిస్తుంది. దీని వలన పాలసీదారులకి చక్కటి ప్రయోజనం కలుగుతుంది. అయితే చాలా మంది పాలసీలు తీసుకుంటారు. అలానే రెగ్యులర్ గా ప్రీమియంలు కూడా చెల్లిస్తారు. మీరు కూడా పాలసీ తీసుకున్నారా..?, రెగ్యులర్‌గా ప్రీమియంలు చెల్లిస్తున్నారా? అయితే తప్పక మీరు ఇది తెలుసుకోవాలి. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు తమ పాన్ నెంబర్లను పాలసీకి లింక్ చెయ్యాలని LIC అంది.
కనుక తప్పక ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు తమ పాన్ నెంబర్లను పాలసీకి లింక్ చెయ్యండి. అయితే ఎలా చెయ్యాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఆన్‌లైన్‌లోనే ఎల్ఐసీ పాలసీకి పాన్ నెంబర్ లింక్ చేయొచ్చు. ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో పాలసీకి పాన్ నెంబర్ లింక్ చేయాలి. దీని కోసం ముందు పాలసీ నెంబర్, పాన్ నెంబర్ లాంటి వివరాలన్నీ సిద్ధం చేసుకోండి.
మీ ఎల్ఐసీ పాలసీకి లింక్ ఉన్న రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే దానికి ఓటీపీ వస్తుంది. ఎల్ఐసీ పాలసీకి పాన్ నెంబర్ లింక్ చేస్తే పాలసీ క్లెయిమ్ చేసే సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక ఎల్ఐసీ పాలసీకి పాన్ నెంబర్ ఎలా లింక్ చేయాలో చూద్దాం.
దీని కోసం ముందుగా https://licindia.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
అక్కడ Online Services సెక్షన్‌లో Online PAN Registration పైన క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీకు ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
ఆ తర్వాత Proceed పైన క్లిక్ చేయాలి.
నెక్స్ట్ పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
మీ జెండర్ ని సెలెక్ట్ చేయాలి.
ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
ఆ తరవాత మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
మీరు నెక్స్ట్ మీ పూర్తి పేరును ఎంటర్ చేయాలి.
మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ పాలసీ నెంబర్ ఎంటర్ చేయాలి
ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Get OTP పైన క్లిక్ చేయాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. వివరాలన్నీ సరిచూసుకొని ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇది అయ్యాక మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది అంతే.