లిపి.గేమ్ యాప్ వారు మన భారతీయత – మన మహాభారతం పేరుతో మహాభారతాన్ని చిన్న చిన్న కథల రూపంలో తీసుకొస్తున్నారు. 2025లో మహాభారత కథలు అందరికీ చేరాలన్న ఉద్దేశ్యంతో చిన్న కథల రూపంలో మహాభారతం మొత్తాన్ని ఆడియో కథల రూపంలో తీసుకొస్తున్నారు.
ఈ మేరకు లిపి.గేమ్ యాప్‍ని సోమవారం రోజున కేఎల్ యూనివర్సిటీలో ఆవిష్కరించారు. ఈ కారక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ ప్రవచన కర్త మంచికంటి వెంకటేశ్వర రావు హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా లిపి. గేమ్ యాప్ ఆవిష్కరణ జరిగింది.
అనంతరం మంచికంటి వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ, ఈ యాప్ లో పిల్లలు, యువత చిన్న చిన్న కథల రూపంలో మహాభారతాన్ని వినవచ్చు. అంతేకాదు, మహాభారతాన్ని వివరాణాత్మకంగా కూడా వినవచ్చని తెలియజేసారు.
ఇంకా, లిపి.గేమ్ డైరెక్టర్ చాగంటి ప్రసాద్ మాట్లాడుతూ, ఇందులోని మహాభారత కథల ద్వారా పిల్లలు మాతృభాషపై పట్టు సాధించవచ్చని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో లిపి.గేమ్ యాప్ డైరెక్టర్ చాగంటి ప్రసాద్, కేఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ జి పార్థసారథి వర్మ, రిజిస్ట్రార్ కే సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ ఇన్‍చార్జి కేఆర్‍ఎస్ ప్రసాద్, యాప్ నిర్వాహకుల్ లక్షీ అపర్ణ తదితరులు పాల్గొన్నారు.