తాజాగా బయటపడిన ఒక విషయం ఇకపై మందుబాబులను వణికిస్తుందని చెప్పాలి. తెలుస్తున్న సమాచారం ప్రకారం మద్యానికి బాగా అలవాటు పడిన వారికి లిక్కర్ అలర్జీ వస్తుంది అని ఈ రోజు ప్రూవ్ అయింది. ఈ పదం వినడానికి కొత్తగా ఉన్నా ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. ఇలా మనదేశంలోనే తొలి కేసును తెలంగాణ రాష్ట్రంలోని హైద్రాబాద్ లో గుర్తించడం జరిగింది. ఢిల్లీ లోని ఆగ్రా నుండి వచ్చిన జాన్ (36) అనే వ్యక్తిలో ఈ లిక్కర్ అలర్జీని గుర్తించారట. మద్యం తాగడానికి అందులోకి ఏదైనా స్టఫ్ ను తీసుకుంటారని తెలిసిందే. అయితే ఈ స్టఫ్ గా నూనెలోనే వేయించిన చికెన్, మటన్ , రోచ్, పల్లీలు మరియు బఠాణీలు లాంటి ఆహారపదార్ధాల వలన ఈ ఎలర్జీ వచ్చిందని వైద్యులు తెలుసుకున్నారు. మాములుగా ఇవి అన్నీ హై హిస్టమిన్ ఫుడ్ కావడం వలన ఈ అలెర్జీ వచ్చిందని రిపోర్ట్ లో బయటపడింది.
అయ్యబాబోయ్: “లిక్కర్ అలర్జీ”… మద్యం తాగితే ప్రాణానికే ప్రమాదం.
-