డ్రా దిశగా బాక్సింగ్ డే టెస్టు కొనసాగుతోంది. టీ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు 54 ఓవర్లకు 112/3 కు చేరుకుంది. నాలుగో వికెట్‌కు యశస్వి (63), పంత్ (28) జోడి 79 పరుగులు జోడించింది. ఇక భారత్ విజయానికి ఇంకా 228 పరుగులు అవసరం కావాల్సి ఉంది. అయితే… ఈ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ లాంటి ప్లేయర్లు దారుణంగా విఫలం అయితే… యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టును ముందుకు సాగిస్తున్నాడు యశస్వి జైస్వాల్. ఇక అటు ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య జరుగుతున్న నాలుగో బాక్సింగ్ డే టెస్టులో మెల్‌బోర్న్ క్రికెట్ మైదానం రికార్డు స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ ను చూసేందుకు 350, 700 మంది హాజరు అయ్యారు. బాక్సింగ్ డే టెస్టులో గడిచిన ఐదు రోజుల్లో ఈ సంఖ్య నమోదు అయింది. గతంలో 1936లో జరిగిన AUSvENG మ్యాచ్‌లో 350,534 రికార్డు సృష్టించబడింది. అయితే.. ఇండియా వర్సెస్ మ్యాచ్ కు మాత్రం 350, 700 మంది హాజరు అయ్యారు.