మందుబాబులకు మహారాష్ట్ర సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. సూపర్ మార్కెట్లు అలాగే వాక్ ఇన్ స్టోర్ లలోనూ మద్యం అందుబాటులోకి తీసుకువచ్చే ప్రతిపాదనకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓ ప్రకటన అధికారికంగా విడుదలైంది. ఈ ప్రకటన ప్రకారం మహారాష్ట్ర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద రిజిస్టర్ చేసుకున్న 1000 చదరపు అడుగులు లేదంటే, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన సూపర్ మార్కెట్లు అలాగే దుకాణాలు సెల్ఫ్ ఇన్ షాప్ పద్ధతిని అవలంబించవచ్చు.
అయితే ప్రార్థన మందిరాలు, విద్యా సంస్థలకు సమీపంలోని సూపర్ మార్కెట్ లోకి మాత్రం ఇందుకు అనుమతి లేదు. మద్యం నిషేధం అమల్లో ఉన్న జిల్లాల్లోనూ దీనికి అనుమతి లేదు. వైన్ అమ్మకాల కోసం లైసెన్స్ ఫీజు కింద సూపర్ మార్కెట్లు 5000 చెల్లించాల్సి ఉంటుంది. రైతులకు అదనపు ఆదాయాన్ని అందించే ఆధారిత వైన్ తయారీ కేంద్రాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీజేపీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.