తెలంగాణ రాష్ట్రంలో 1.64 లక్షల మంది ఓటర్లు మరణించగా.. వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి ఎన్నికల సంఘం తొలగించింది. దేశ ఎన్నికల సంఘం ఏటా ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆ కసరత్తు పూర్తి చేసి ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల తుది జాబితా ప్రకటించింది.
విశ్వసనీయ వర్గాలు తెలిపిన ప్రకారం సికింద్రాబాద్, యాకుత్ పుర, చంద్రయాన్ గుట్ట, గోషామహల్, కార్వాన్, జూబ్లీహిల్స్, నాంపల్లి, మలక్పేట, మహేశ్వరం అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఓటర్లు మరణించలేదు. మేడ్చల్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, చార్మినార్ నియోజక వర్గాల్లో ఇద్దరు చొప్పున ముషీరాబాద్ లో ఒకరు మరణించారు.
కేసులు, తదితర కారణాల తో మొత్తం మూడు వందల మంది ఓటు హక్కు కోల్పోయారు. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా… ఏకంగా 1.64 లక్షల మంది ఓటర్ల పేర్లను ఎన్నికల సంఘం తొలగించింది. అంతేకాదు… అనంతరం 2022 ఓటర్ల జాబితా ను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది.