మందుబాబుల కడుపుకొట్టనున్న ప్రభుత్వం… మార్చి 30న “నో లిక్కర్” !

-

తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ గురువారం (మార్చ్ 30) రోజున రాష్ట్రంలో మద్యం షాపులు మూసివేయనున్నాయి. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని శోభాయాత్రను ఎంతో కన్నుల పండుగగా జరపనున్నారు. అయితే దేవుని కార్యక్రమం కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకూడదన్న నిర్ణయంతో మార్చ్ 30వ తేదీన మద్యం షాపులు, కళ్ళు దుకాణాలు, బార్లు, క్లబ్ లు, ఫైవ్ స్టార్ హోటళ్లు మరియు అందులో ఉండే బార్ రూమ్ లు మూసివేయాలని అధికారులు ఆదేశించారు.

 

సరిగ్గా మార్చ్ 30వ తేదీ ఉదయం 6 గంటల నుండి 31వ తేదీ 6 ఉదయం గంటల వరకు మద్యం షాపులు బంద్ అవుతాయి. ఈ వార్త తెలిసిన మందు బాబులు లభో దిబో మంటూ కొట్టుకుంటున్నారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం మందుబాబుల కడుపు కొట్టింది అంటూ నెటిజన్లు జోకులు వేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version