స్థానిక ఎన్నికల్లో ఏపీ అంతా ఫ్యాన్ గాలి .. వైకాపా ఐనా కానీ వాళ్ళకి మాత్రం చెమటలు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేయడంతో అధికారంలో ఉన్న వైసిపి పార్టీ మంచి జోరు మీద ఉంది. స్థానిక ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఫ్యాన్ గాలి గట్టిగా వియ్యడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. చాలా వరకు ఇప్పటికే కొన్ని స్థానాలలో వైసీపీ పార్టీ గెలిచినట్లు పార్టీలో టాక్. మరోపక్క ప్రత్యర్థి పార్టీలకు ఎన్నికలలో నిలబడటం కోసం అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేనట్లు వార్తలు వస్తున్నాయి. ప్రజా సంకల్ప పాదయాత్రలో మరియు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ పరిపాలిస్తున్న తరుణంలో జగన్ కి ఏపీ ప్రజలు ప్రస్తుతం బ్రహ్మరథం పడుతున్నారని ఈ దెబ్బతో టిడిపి కనుమరుగవడం గ్యారెంటీ అనే టాక్ నడుస్తుంది.

 

అన్ని చోట్ల బాగానే ఉన్నా గానీ రాజధాని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మాత్రం వైసిపి పార్టీ నాయకులు అయినా గాని, స్థానిక ఎన్నికలు అంటే చమటలు పడుతున్నాయి అనే కామెంట్లు వినబడుతున్నాయి. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ గాలి గట్టిగా వీచినా …రాజధాని పరిసర ప్రాంతాల్లో మాత్రం డౌటే అనే టాక్ బలంగా ఏపీ రాజకీయాల్లో వినబడుతుంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version