మహేష్ ని వద్దంటున్న చిరంజీవి…?

-

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ని చిత్ర యూనిట్ ఆచార్యా గా అనుకుంటున్నట్టు సమాచారం. దీనిపై ఇటీవల చిరంజీవి కూడా ఒక ప్రకటన చేసారు. ఈ సినిమా ఇప్పుడు కీలక సన్నివేశాల చిత్రీకరణలో ఉంది. వచ్చే వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది చిత్ర యూనిట్. దీని డేట్ కి సంబంధించి త్వరలోనే ప్రకటన రానుంది.

ఇది పక్కన పెడితే ఈ సినిమాలో చిరంజీవి పక్కన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఒక కీలక పాత్రలో మహేష్ బాబుని ఎంపిక చేసారని టాలీవుడ్ లో కూడా దీనిపై చర్చ జరిగింది. మరి ఏమైందో ఏమో తెలియదు గాని ఇప్పుడు చిరంజీవి మాత్రం అసలు వద్దని అంటున్నారట. మహేష్ కూడా ఈ సినిమా చేయడానికి సుముఖంగానే ఉన్నాడట.

మహేష్‌కు ఏమాత్రం ఇంపార్టెన్స్ తగ్గినా ఫ్యాన్స్ నుంచి ఇబ్బంది ఎదురవుతుందని కాబట్టి వద్దని చిరంజీవి చెప్పారట. ఇక భారీ పారితోషికం కూడా మహేష్ బాబు కి ఇవ్వాలని అందుకే అవసరం లేదని చెప్పారట. ఆ స్థానంలో రామ్ చరణ్ ని తీసుకుంటే బెటర్ అని తన కుమారుడు కాబట్టి, దానికి తోడు నిర్మాత కూడా కావడంతో ఏ ఇబ్బంది ఉండదు అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు ఈ సినిమాలో మహేష్ పాత్రపై అనేక అనుమానాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version