దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని పెంచే అవకాశాలు ఉన్నాయా..? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ప్రస్తుతం దేశంలో కేసులు 21 వేలు దాటాయి. రాబోయే రెండు వారాల్లో ఈ కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక పరీక్షలను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేగవంతం చేసాయి. రాబోయే వారం రోజుల్లో భారీగా పరిక్షలు నిర్వహించి కేసులు బయటపడితే మాత్రం…
ఇప్పుడు లాక్ డౌన్ ని పెంచడానికి కేంద్రం ఆసక్తి చూపిస్తుంది. ఈ నెల 28 న ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాడితే మాట్లాడి లాక్ డౌన్ విషయంలో వారి అభిప్రాయాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకుని ఆ తర్వాత లాక్ డౌన్ విషయంలో నిర్ణయం తీసుకోవాలి అని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి.
అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయాన్ని చెప్తుంది. లాక్ డౌన్ ని గాని ఆంక్షలను గాని సడలిస్తే ఇబ్బంది పడే అవకాశం ఉందని పేర్కొంది. భారత్ లో మే రెండో వారానికి కేసులు తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి లాక్ డౌన్ ని సడలిస్తే ఇబ్బందులు వస్తాయని జూన్ వరకు లేదా మే 19 వరకు లాక్ డౌన్ ని పెంచే సూచనలు ఉన్నాయని అంటున్నారు.