మీ సమస్యల్ని తెలుసుకునేందుకే పాదయాత్ర : లోకేశ్‌

-

యువగళం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. అయితే.. అయితే నేడు 66వ రోజు శింగనమల నియోజకవర్గంలో పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. సోడనంపల్లి క్రాస్ లోని విడిది కేంద్రం నుండి సోమవారం పాదయాత్ర ప్రారంభమైంది. లోకేశ్ తొలుత సోడనంపల్లి శివార్లలో గొర్రెల పెంపకందారులను కలసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాదయాత్ర దారిలో ఎస్సీ కాలనీలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లపై పారుతున్న మురుగునీటిని పరిశీలించి, అధికారంలోకి రాగానే డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సలకంచెరువు వద్ద బీసీలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో వారి సాధకబాధకాలు విన్నారు.

కొరివిపల్లిలో యువనేత స్థానికులతో ముచ్చటించారు. ఉల్లికల్లు గ్రామంలో లోకేశ్ కు స్థానికులు స్వాగతం పలికారు. తర్వాత ఉల్లికుంటపల్లిలోని విడిది కేంద్రానికి పాదయాత్ర చేరుకుంది. మంగళవారం ఉదయం పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలో ప్రవేశించనుంది. అయితే.. ఓవైపు మండుటెండ‌లు… మరోవైపు ఎడారిని త‌ల‌పించే రాయ‌ల‌సీమ భూములు… అయినా త‌ప్పని బ‌డుగు జీవుల బ‌తుకు ప‌య‌నం… కొండా,గుట్టల్లో గొర్రెలు మేపుతూ జీవ‌నం! ఈ స‌మ‌యంలో అనుకోని అతిథిలా వ‌చ్చి నారా లోకేశ్ గొర్రెల పెంప‌కందారుల‌ను ప‌ల‌క‌రించారు. సోడనంపల్లి క్రాస్ వద్ద నుంచి యువనేత నారా లోకేష్ 66వ రోజు పాదయాత్ర ఆరంభించారు. కొద్ది దూరం వెళ్లాక దారికి దూరంగా క‌నిపించిన గొర్రెల పెంప‌కందారుల వ‌ద్దకి వెళ్లిన నారా లోకేశ్ వారి జీవన స్థితిగతులు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీలాంటి క‌ష్టజీవుల‌ని కలుసుకుని, మీ సమస్యల్ని తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నానని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version