ధాన్యం కొనుగోళ్లపై మంత్రి హరీశ్‌రావు కీలక ఆదేశాలు

-

సీఎం కేసీఆర్‌ యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంగళవారం నుంచే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు బీఆర్‌ఎస్‌ భవన్‌లో కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాలు అధికారులు, డీఎంలు, ఎఫ్‌సీఐ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ రవీందర్‌ సింగ్‌, సీఎస్‌ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌర సరఫరాల కమిషన్‌ అనీల్ కుమార్‌ పాల్గొన్నారు.

Complete Kanti Velugu scheme within 100 working days: Harish Rao -  Telangana Today

ఈ సందర్భంగా మంత్రుతులు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని కొనుగోళ్లకు సిద్ధం కావాలని ఆదేశించారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని, ఇందుకు 7100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. యాసంగికి సీజన్ సీఎంఆర్‌ను 30వ తేదీలోగా మిల్లర్ల నుంచి సేకరించాలని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సీఎంఆర్‌ అప్పగింత విషయంలో ఆలస్యం జరిగితే ఉపేక్షించబోమన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version