ఇప్పుడు ఏపీలో టీడీపీకి, వైసీపీకి తగ్గపోరు నడుస్తోంది. ఇరు పార్టీలు కూడా ఢీ అంటే ఢీ అన్నట్టు రాజకీయాలు సాగిస్తున్నాయి. దీంతో ఇండ్ల ముట్టడి వరకు వర్గ విభేదాలు వస్తున్నాయి. మొన్నటి వరకు ఈ రెండు పార్టీల నడుమ ఉన్న విభేదాలు మాటల నుంచి దాడుల వరకు వెళ్లింది. రీసెంట్ గా టీడీపీ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సీఎం జగన్ మీద చేసిన వ్యాఖ్యలు పెను దుమరాం రేపాయి. దీంతో ఈ వ్యాఖ్యలకు నిరసనగా ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే జోగి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడించడంతో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది.
ఈ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తులు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇక పోలీసులు వెంటనే అలర్ట్ అయిపోయి సీఎం జగన్ ఇంటికి వెళ్లే దారుల్లో కూడా భారీగా భద్రతను ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయాయి. ఇక టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. చంద్రబాబు ఇంటిపై ఎలా అయితే దాడికి దిగారో అలాగే జగన్ ఇంటిని కూడా ముట్టడిస్తామంటూ తెలుగు తమ్ములు హెచ్చరించడంతో పరిస్థితి ఉద్రికత్తకు దారి తీసింది.
ఇక దీనిపై లోకేష్ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన పని అత్యంత దారుణమని చెప్పారు. ఇక సీఎం జగన్ పై కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ గూండాలను తమ ఇంటి మీదకు పంపించడాన్ని బట్టి చూస్తుంటే ఆయన దిగజారుడుతనం తెలుస్తోందని విమర్శించారు. ఇక తమ ఇంటికి ఎంత దూరమో జగన్ ఇల్లు కూడా అంతే దూరమని అది గుర్తు పెట్టుకోవాలంటూ హెచ్చరించారు. ఇంకా ముందడుగు వేసి జగన్ ప్రవర్తన చూస్తే పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టు కనిపిస్తుందని మాట్లాడటం విశేసం. మరి దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.