ఆ విషయంలో వైసీపీ హ్యాపీ…టీడీపీ ఫుల్ హ్యాపీ…!

-

గత కొన్నిరోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న అంశం ఏదైనా ఉందంటే అది జగన్ బెయిల్ రద్దు అంశమే. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సి‌బి‌ఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సి‌ఎంగా ఉన్న జగన్ బెయిల్ కండిషన్లని అతిక్రమిస్తున్నారని, తక్షణమే బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ పిటిషన్ వేశారు. పనిలో పనిగా విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలంటూ రఘురామ పిటిషన్ వేశారు.

ysrcpandtdp

ఇక ఈ పిటిషన్లపై చాలా రోజులు వాదనలు జరిగాయి. అనేక ట్విస్ట్‌లు మధ్య తాజాగా సి‌బి‌ఐ కోర్టు బెయిల్ రద్దు చేయడానికి నిరాకరించింది. ఈ క్రమంలోనే సీబీఐ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల వైసీపీ నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. జగన్‌ని ఇబ్బందుల పాలు చేయడానికే రఘురామ ఈ పిటీషన్‌ను దాఖలు చేశారని,  రాజకీయ దురుద్దేశంతో తప్ప మరో కారణం లేదని, చివరికి న్యాయమే గెలిచిందని వైసీపీ నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తోన్నారు.

అయితే మొదట నుంచి జగన్ బెయిల్ రద్దు అవుతుందని, త్వరలోనే ఆయన జైలుకు వెళ్తారంటూ సోషల్ మీడియాలో హడావిడి చేసిన టి‌డి‌పి శ్రేణులు, ఇప్పుడు రివర్స్‌లో మాట్లాడటం మొదలుపెట్టారు. జగన్ బెయిల్ రద్దు కాకపోవడమే మంచిది అయిందని, ఒకవేళ బెయిల్ రద్దు అయ్యి జగన్ జైలుకెళితే, ఆయన ప్లేస్‌లో మరొకరు సి‌ఎంగా వచ్చేవారని, అలాగే కావాలనే రఘురామ, టి‌డి‌పితో కుట్ర చేసి జగన్‌ని జైల్లో పెట్టించారని వైసీపీ వాళ్ళు ప్రచారం చేసుకునేవారని, మళ్ళీ దాని వల్ల జగన్‌కే సింపతీ పెరుగుతుందని, అప్పుడు వైసీపీకే బెనిఫిట్ అవుతుందని తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు బెయిల్ రద్దు కాకపోవడం వల్ల జగన్ పాలన పూర్తిగా ప్రజలకు అర్ధమవుతుందని, అప్పుడు వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుందనే భావనలో తమ్ముళ్ళు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version