తిరుమలలో సినిమా పాటలు.. వీడియో షేర్ చేసిన నారా లోకేష్

-

శ్రీవారి సన్నిధి ఆయన తిరుమలలో… వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భక్తి పాటలు కాకుండా…. సినిమా పాటలు వేశారు టిటిడి అధికారులు. దీంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే వీటిని క్యాస్ట్ చేసుకున్న ప్రతిపక్షాలు జగన్ సర్కార్ పై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా… తిరుమలలో సినిమా పాటలు వేసిన.. వీడియో షేర్ చేసాడు నారా లోకేష్.

“దేవుడంటే ఆట‌లాట‌లా వుందా? ఏడుకొండ‌ల‌వాడి స‌న్నిధిలో సినిమా పాట‌లా? భ‌క్తుల‌కి న‌ర‌కం చూపుతున్నారు. ప‌విత్ర‌త మంట‌గ‌లుపుతున్నారు. గోవింద‌నామ‌స్మ‌ర‌ణ మారుమోగే తిరుగిరుల‌పై సినిమా పాట‌ల ప్ర‌ద‌ర్శ‌న దారుణం. ఈ అప‌చారాన్ని క‌వ‌ర్ చేసేందుకు రేపు ఏ సినిమాటిక్ క‌థ వినిపిస్తారో! ” అని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు తిరుమలలో సినిమా పాటలు వేసిన వీడియో ని కూడా షేర్ చేశారు నారా లోకేష్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ  వీడియోను చూసిన ప్రజలు జగన్ సర్కార్ పై మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version