బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు ఊహించని షాక్ తగిలింది. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులపై లుక్ అవుట్ నోటీసులు అయ్యాయి. ముంబై పోలీసులు రూ. 60 కోట్ల మోసం కేసులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఒక వ్యాపారవేత్త చేసిన ఫిర్యాదు ప్రకారం, శిల్పా-రాజ్ వ్యాపార విస్తరణ పేరిట 2015 నుంచి 2023 వరకు సుమారు రూ. 60 కోట్లు తన నుంచి తీసుకున్నారని ఆరోపించారు.

ఈ మొత్తం వ్యాపారంలో పెట్టకుండా, వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నారని ఫిర్యాదుదారు పోలీసులకు తెలిపాడు. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, పోలీసులు విదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు ఈ లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు ఊహించని షాక్ తగిలింది.