రేవంత్ సర్కారుపై అన్నదాతలు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసేందుకు సిద్ధపడుతున్నారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే మిర్చి రైతులు ఈనెల 18న రాష్ట్రంలో ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలో ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
మిర్చి పంటకు కనీస మద్దతు ధర రూ.25 వేలు ఇవ్వాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేసే క్రమంలో ఖమ్మంలో ఈనెల 18న మహాధర్నాకు పిలుపునిచ్చినట్లు మిర్చి రైతులు తెలిపారు.