కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలు కుదేలయ్యాయి. కొన్ని కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయారు. అయితే ఇప్పుడిప్పుడే నెమ్మదిగా అన్ని రంగాలు కోలుకుంటున్నాయి. అయినప్పటికీ పూర్తిగా నష్టాన్ని భర్తీ చేయడానికి మరింత కాలం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే కంపెనీలు మళ్లీ ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. నిరుద్యోగులను మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. కనుక జాబ్ పోయిన వారు నిరాశ చెందకుండా ఈ జాబ్ ప్లాట్‌ఫాంలలో ఒక్కసారి దరఖాస్తు పెట్టి చూడండి. ఉద్యోగం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మరి ఆ ప్లాట్‌ఫాంల వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
1. వసిటమ్ (Vasitum)
2019లో దీన్ని ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ సైట్ పనిచేస్తుంది. ఇందులో అడ్వాన్స్‌డ్ హైరింగ్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేశారు. అందువల్ల టాలెంట్ ఉన్నవారికి చాలా సులభంగా జాబ్ వచ్చేందుకు ఇందులో అవకాశం ఉంటుంది.
2. ఇండీడ్ ( Indeed)
దేశంలోని ప్రముఖ జాబ్ పోర్టల్స్‌లో ఇండీడ్ కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఇందులో వెతకవచ్చు. కరోనా వైరస్ వర్క్ టూల్స్‌ను ఇందులో అందిస్తున్నారు. అందువల్ల జాబ్ వెదుక్కోవడం ఇందులో సులభతరం అవుతుందని చెప్పవచ్చు.
3. ప్లేస్‌మెంట్ ఇండియా (PlacementIndia)
ఇందులో అభ్యర్థులు తమకు కావల్సిన జాబ్ కోసం సక్సెస్ ఫుల్ ప్రొఫైల్‌ను బిల్డ్ చేసుకోవచ్చు. అందు కోసం పలు టూల్స్ ఉంటాయి. వాటితో జాబ్‌ను సులభంగా వెదుక్కోవచ్చు.
4. మాన్‌స్టర్ (Monster)
ప్రముఖ జాబ్ పోర్టల్స్ లో ఇది కూడా ఒకటి. దీని గురించి చాలా మందికి తెలుసు. ఇందులో ఇండియన్ జాబ్ సీకర్స్, రిక్రూటర్స్ కోసం ప్రత్యేక ఆప్షన్లు ఇచ్చారు. అభ్యర్థులు సులభంగా జాబ్స్ వెదకవచ్చు.
5. షైన్ (Shine)
దేశంలో షైన్ ద్వారా 3 లక్షల మందికి పైగా ఉద్యోగాలు పొందారు. జాబ్ సీకర్స్, రిక్రూటర్లకు ఇది కూడా బెస్ట్ ప్లాట్‌ఫాం అని చెప్పవచ్చు. దీంట్లో కూడా నిరుద్యోగులు సులభంగా ఉద్యోగాల కోసం వెతకవచ్చు.