కేఫ్ కాఫీ డే సిద్దార్థ : విషాదం వెనుక ఉన్న విజయం

-

డబ్బు ఎంత పనైనా చేస్తుంది.. మనిషి బతికించే అదే డబ్బు మనిషి చంపేస్తుంది. కేఫ్ కాఫీ డే సిద్దార్థ విషయంలో అదే జరిగింది. ఆయన ఆత్మహత్య వెనక ఎలాంటి కారణాలు ఉన్నా అతని జీవిత ప్రయాణం మాత్రం స్ఫూర్తిగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఆయన కృషి విజేతగా నిలిపాయి ఎంతో మంది కాఫీ ఉత్పత్తి దారులకు ఆదాయ మార్గాన్ని చూపాయి. యిరవై సంవత్సరాల కింద ఒకే ఒక్క కేఫ్ కాఫీ డే తో ప్రారంభమై నేడు ఇండియా మొత్తం పెద్ద పెద్ద కేఫ్ లకు పోటీ ఇచ్చేలా ఎదిగాడు సిద్దార్థ. కానీ 59 ఏళ్ల వయసులో ఆత్మహత్యతో అతని జీవితం విషాదంగా ముగిసింది.. ఈ విషాదంకంటే ముందు సిద్దార్థ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది. ఈ రంగంలో ఎలా యిదిగాడు..ఈ కథనం చదవండి.

బెంగళూర్ లోని చిక్కమంగళూరులో కాఫీ పెంపకందార్ల కుటుంబం నుంచి వచ్చారు సిద్ధార్థ. మంగళూరు యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తిచేసిన వెంటనే.. మల్నాడ్ ప్రాంతానికి చెందిన చాలా మంది లాగానే ఆయన కూడా కర్ణాటక నుంచి ముంబైకి వెళ్లారు. కొంత కాలం ఒక పెట్టుబడి సంస్థలో పనిచేశారు. అనంతరం బెంగళూరు తిరిగివచ్చి తన సొంత కంపెనీ సివాన్ సెక్యూరిటీస్‌ని స్థాపించారు.

1996లో బెంగళూరులో అత్యంత జనసమ్మర్థమైన వీధుల్లో ఒకటైన బ్రిగేడ్ రోడ్‌లో తొలి కెఫే కాఫీ డే ఔట్‌లెట్‌ను ప్రారంభించారు. బెంగళూరులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరుగుతున్న రోజులవి. ఇంటర్నెట్ అనేది ఇప్పటిలా అప్పుడు అందరికీ ఉచితంగా లభించే వస్తువు కాదు. ఇంటర్నెట్ ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ ఒక కప్పు కేపూచినో తాగటం అక్కడి వారికీ కొత్త అనుభూతిగా ఉండేది. బ్రిగేడ్ రోడ్‌లో మొదలైన ఈ కఫేలు నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ తెరుచుకున్నాయి. కొద్దీ రోజులకే మరో స్నేహితుడితో కలిసి దేశమంతటా సీసీడీ ఔట్‌లెట్లు తెరిచారు. ఇప్పుడు అనేక వర్గాల వారికి కేఫ్ కాఫీ డే లు మీటింగ్ పాయింట్లుగా మారాయి. దేశవ్యాప్తంగా 1,700 పైగా ఉన్న ఈ ఔట్‌లెట్లు.. యువ ప్రొఫెషనల్స్ సమావేశాలు మొదలుకుని పెళ్లిచూపుల కలయికల వరకూ.. పని చేసుకునే ప్రదేశాలుగా కూడా ఉపయోగపడుతున్నాయి.


సిద్దార్థ కాఫీ రంగంలోకి అడుగు పెట్టాక కొన్ని సంవత్సరాల పాటు దేశీయ కాఫీ వినియోగం ఏటా రెండు శాతం చొప్పున పెరుగుతూ పోయింది. సౌత్ ఇండియా రెస్టారెంట్లలో విక్రయించే కాఫీతో పోలిస్తే కెఫే కాఫీ డే ని భారతదేశంలోని అతి పెద్ద బ్రాండ్లలో ఒకటిగా మార్చారు సిద్ధార్థ. స్టార్ బక్స్ వంటి ప్రత్యర్థుల ప్రవేశాన్ని తిప్పికొడుతూ.. వివిధ నగరాల్లో ప్రైమ్ లొకేషన్లలో కెఫేలను ఏర్పాటుచేశారు. స్టైలిష్‌గా డిజైన్ చేసిన కెఫేలలో కాఫీని విక్రయించటం ద్వారా టీ తాగే భారతదేశపు ప్రజలను ముఖ్యంగా యువతను కాఫీ ప్రియులుగా మార్చారు సిద్ధార్థ. అయితే.. దేశంలో కాఫీ వినియోగాన్ని పెంచటం.. నిలకడలేని అంతర్జాతీయ మార్కెట్ ఎగుమతుల మీద పూర్తిగా ఆధారపడిన చిన్న, అల్పాదాయ కాఫీ ఉత్పత్తిదారులకు ప్రత్యామ్నాయం కల్పించి ప్రోత్సహించటం ఆయన చేసిన అతిపెద్ద కృషి. కాఫీ పెంపకందార్లకు ఇంత మేలు చేసిన సిద్ధార్థ వంటి వ్యక్తి ఆత్మహత్య చేస్కోవడం విషాదమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version