ఏపీలో జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వెళ్లిన వారంతా పల్లెలకు తిరిగొచ్చారు. ప్రతి ఇంట్లోని వారంతా తమ కుటుంబాలతో సంతోషంగా పండుగను జరుపుకుంటున్నారు. యువత, పిల్లలంతా గాలిపటాలు ఎగరేస్తుంటే.. పురుషులు మాత్రం జోరుగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో వినూత్నంగా కోడి పందాల నిర్వహణ కొనసాగుతోంది. కోడి పందాల్లో గెలిచిన వారికి ‘రాయల్ ఎన్ ఫీల్డ్’దిచక్ర వాహనం బహుమతిగా ప్రకటించారు. పోసిన కృష్ణాంజనేయులు జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యుల కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాయల్ ఎన్ ఫీల్డు బైక్ ఎవరు కైవసం చేసుకుంటారా? అని ఏలూరులో సర్వత్రా ఆసక్తి నెలకొంది.