నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు పండించే రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. తనను గెలిపిస్తే.. పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చి.. అనేక ఇబ్బందులు పడ్డ అరవింద్ కుమార్ అనుకున్నది సాధించినందుకు సంతోసంగా ఉందన్నారు.
బోర్డు ఏర్పాటుకు సహకరించిన మంత్రి పీయూష్ గోయల్ కు సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ లో ఇవాల పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లోని తన కార్యాలయం నుంచి వర్చువల్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. “అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు రైతుల పండుగ. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రజలకు శుభవార్త అందించిన మహనీయుడు ప్రధాని నరేంద్ర మోడీ, సహకరించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ఈ బోర్డు ఏర్పాటులో కర్త, కర్మ, క్రియగా ఉంటూ మొండిపట్టులో విజయం సాధించిన ఎంపీ అర్వింద్, బోర్డు చైర్మన్ గా నియమితులైన పల్లె గంగారెడ్డికి అభినందనలు తెలిపారు.