పారాలింపిక్స్‌లో ప్రేమాయణం.. అథ్లెట్‌కు ప్రపోజ్ చేసిన కోచ్..

టోక్యో పారాలింపిక్స్‌ లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. పతకం గెలవాలనే లక్ష్యంతో కేయులా నిద్రియా పెరీరా పారాలింపిక్స్‌ కు వచ్చింది. చూపు లేని ఈ స్ప్రింటర్ 200 మీటర్ల పరుగు పందెం లో పాల్గొంది. అయితే… సెమీ ఫైనల్స్‌ కు సంబంధించిన క్వాలిఫయింగ్‌ రౌండ్‌ లో ఆమె ఓడిపోయింది.

ఈ నేపథ్యంలోనే ఈ ఓటమి చెందిన నిద్రియా పెరీరాకు ఆమె కోచ్‌ మాన్యవల్‌ ఆంటోనియో వాజ్‌డావే ప్రపోజ్‌ చేశాడు. ఓడిన ఆమెను ఓదార్చుతాడని అందరూ అనుకుంటే… మోకాళ్లపై కూర్చొని ‘విల్‌ యూ మ్యారీ మీ ‘ అని ప్రపోజ్‌ చేశాడు ఆ కోచ్‌. అనేక మంది అథ్లెట్లు, అధికారులు, చూస్తుండగానే పెరీరాకు ఆంటోనియో ప్రపోజ్‌ చేశౄడు. వెంటనే పెరీరా కూడా అవును.. నేను పెళ్లి చేసుకుంటాను అని ఆన్సార్‌ ఇచ్చింది. దీంతో అక్కడ ఉన్న ఆటగాళ్లందరూ కేరింతలు కొట్టారు. ఆ జంటను అభినందించారు. అయతే.. ఈ లవ్‌ ప్రపోజల్‌ ను టోక్యో పారాలింపిక్‌ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఘటన వైరల్‌ గా మారింది.