ఇండియాలో ఉంటూ కొందరు దాయాది పాకిస్తాన్ పట్ల తమ ప్రేమను చాటుకుంటున్నారు. ఉగ్రదాడులు జరుగుతున్నా.. భారతీయులు ప్రాణాలు కోల్పోతున్నా.. ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్ మీద ప్రేమను చాటడం ఏంటని జాతీయవాదం బలంగా ఉన్న వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వ్యక్తులను వెంటనే ఆ దేశానికి పంపించేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం పాక్ మీద ప్రేమను కురిపించే వారు ఇండియా విడిచి వెళ్లిపోవాలని సంచలన వ్యాక్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తాన్ జెండాను ప్రేమిస్తున్న కొందరు యువకుల దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఏపీలోని నంద్యాల ఎన్జీవోస్ కాలనీలో కొందరు యువకులు పాకిస్తాన్ జెండాను ప్రేమిస్తున్నట్లు తెలుస్తోంది. కాశ్మీర్ ఘటన తర్వాత కూడా ఈ చర్యను ఎలా ఆక్షేపించగలం. సొంత దేశంలో విదేశీ జెండా ప్రేమ ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు మీద పడిన పాక్ జెండాలను ఓ యువకుడు కలెక్ట్ చేసుకుని వెళ్లడం ఆగ్రహం కలిగిస్తోంది.
పాకిస్తాన్ జెండాను ప్రేమిస్తున్న కొందరు యువకులు
నంద్యాల ఎన్జీవోస్ కాలనీలో కొందరు యువకులు పాకిస్తాన్ జెండాను ప్రేమిస్తున్నారు. కాశ్మీర్ ఘటన తర్వాత కూడా ఈ చర్య ఖండనీయం. సొంత దేశంలో విదేశీ జెండా ప్రేమ ఆందోళన కలిగిస్తోంది. వీరిపై చట్టపరమైన చర్యలు ఎలా ఉంటాయో చూడాలి. pic.twitter.com/3H3E85A2VN
— ChotaNews App (@ChotaNewsApp) May 1, 2025