సోహైల్ విడాకులకు నేను కారణం కాదు: హన్సిక

-

యాపిల్ బ్యూటీ హన్సిక గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. డిసెంబర్‌ 4న తన ప్రియుడు సోహైల్‌తో ఆమె ఏడడుగులు వేశారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. ‘‘లవ్‌ షాదీ డ్రామా’పేరుతో హన్సిక వెడ్డింగ్‌ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో హన్సిక తన పెళ్లి గురించి రూమర్స్ బయటకు రావడం ఆ తర్వాత తన కాబోయేవాడికి అంతకుముందే పెళ్లైందనే వార్తలు వంటి విషయాల గురించి మాట్లాడారు.

‘‘’నా పెళ్లి గురించి అన్ని విషయాలను రహస్యంగా ఉంచాలనుకున్నా. అయితే, నాకు తెలియకుండానే పెళ్లి వార్తలు బయటకు వచ్చేశాయి. అది నాకు ఏమాత్రం నచ్చలేదు. ఒక సెలబ్రిటీగా ఇది నాకు నేను చెల్లించుకుంటున్న మూల్యం. సోహైల్‌ గురించి మొదట్లో వార్తలు వచ్చినప్పుడు ఎంతో ఒత్తిడికి లోనయ్యాను. ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటి సమయంలో అమ్మ ఇచ్చిన సూచనతో మొదటిసారి మా ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశాను. సోహైల్‌ ప్రపోజ్‌ చేసిన ఆ ఫొటోలు చూసి అందరూ అభినందనలు తెలిపారు. నాకెంతో ఆనందంగా అనిపించింది.’

‘పరిస్థితులన్నీ చక్కబడ్డాయని అనుకున్న సమయంలో తిరిగి షూటింగ్స్‌ కోసం చెన్నైకు వెళ్లాను. అదే సమయంలో అతడికి గతంలోనే పెళ్లి అయ్యిందని వార్తలు వచ్చాయి. ఆ పెళ్లిలో నేను పాల్గొన్న ఫొటోలు షేర్‌ చేస్తూ.. సోహైల్‌ తన భార్య నుంచి విడిపోవడానికి నేనే కారణం అని విమర్శలు చేశారు. నిజం చెప్పాలంటే, నా భర్త గతం నాకు తెలుసు. అతడి విడాకులకు నేను కారణం కాదు’’’ అని హన్సిక వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version