లవ్ స్టొరీ ట్రైలర్ వచ్చేసింది..!

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమాకు శేకర్ కమ్ముల దర్శకత్వం వహించగా చైతూ సరసన హీరోయిన్ గా సాయి పల్లవి నటించింది. ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్ మరియు పాటలు విడుదలవగా ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా తాజాగా ఈరోజు చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. కాగా ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. తెలంగాణ యాసలో చైతూ, సాయి పల్లవి ఆకట్టుకున్నారు.

బిజినెస్ చేయాలనుకునే ఆలోచనలో చైతూ పడ్డ కష్టాలను చూపించారు. మిడిల్ క్లాస్ వాళ్ళ ఇబ్బందులు సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి డ్యాన్సర్ గా కనిపించబోతుంది. ట్రైలర్ లో చైతు సాయి పల్లవి మధ్య డైలాగులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంతే కాకుండా ట్రైలర్ లో ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఎంతో ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ …మరియు లోకేషన్స్ ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.