దారుణం..కూతురిని ప్రేమించాడని ఇనపరాడ్ తో దాడి..!

భోపాల్ లో దారుణం చోటు చేసుకుంది. తన కూతురిని ప్రేమించాడు అని ఓ తండ్రి యువకుడిపై నడీ రోడ్డు మీద దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే…ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పుష్పక్ భావ్సర్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి తో ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మధ్య ప్రేమ ముదరడం తో పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే తమ పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారో లేదో అని భావించి ఇంటి నుండి పారిపోయారు.

పెద్దలు ఫోన్ చేసి ఇంటికి రావాలని కోరగా తిరిగి వచ్చారు. ఇక తన కూతురిని ప్రేమించిన యువకుడిపై ఆమె తండ్రి పగ పెంచుకున్నాడు. ఆదివారం కటింగ్ షాక్ లో షేవింగ్ చేసుకుంటుండగా వచ్చి దాడి చేశాడు. స్థానికులు చూస్తుండగానే యువకుడిపై రాడ్డు..సుత్తి తో దాడి చేశారు. ఈ ఘటన లో తీవ్రంగా గాయప్పడ్డ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. యువకుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.