పెళ్లి జరుగుతుండగా ప్రియుడి ఎంట్రీ…బొట్టు పెట్టి…!

-

కొన్నిసార్లు పెళ్లి లో ప్రియురాలు ఎంట్రీలు…ప్రియుడు ఎంట్రీ ఇవ్వడాలు కామన్…కానీ అలా వచ్చినవారు గొడవ చేయడం లేదంటే తీసుకుని పోవడం చేస్తుంటారు. కానీ యూపీలో ప్రియురాలి పెళ్లికి వచ్చిన ఓ యువకుడు చేసిన పని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అలా ఎందుకు చేశాడో కూడా అర్థం కాక తల పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే…. యూపీలోని ఘోరక్ పూర్ లో ఓ యువతి పెళ్లి జరిగింది. అయితే పెళ్లి మధ్యలో మాజీ ప్రియుడు ఎంట్రీ ఇచ్చాడు.

వచ్చేటప్పుడు అతడు సిందూరం తీసుకుని వచ్చాడు. దాన్ని యువతి నుదిటికి పెట్టే ప్రయత్నం చేయగా ఆమె నిరాకరించింది. కానీ అతడు సిందూరం పెట్టాడు. అక్కడ ఉన్నవాళ్లు అంతా షాక్ అయ్యి అతడిని పట్టుకునేందుకు పరిగెత్తారు. కానీ ఎవరికీ దొరక్కుండా పారిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా తన ప్రేయసిని చివరి సారి ఆశీర్వదించి వెళ్ళాడు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version