చాలా మంది కాఫీకి బాగా అలవాటు పడిపోతారు. రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు కాఫీ తాగకపోతే వాళ్ళ రోజు మొదలవ్వదు. అయితే కాఫీ తాగడం వల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కాఫీని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం.
ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది:
కాఫీని ఎక్కువగా తీసుకునే వారిలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయి. అదే విధంగా కార్డియో వాస్క్యులర్ సమస్యలు అయిన హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్, కరోనరీ ఆర్టరీ డిసీజ్ మొదలైనవి వ్యాపిస్తాయి. కాబట్టి కాఫీని ఎక్కువగా తాగడం మంచిది కాదు.
హైబీపీ రిస్క్ పెరుగుతుంది:
హైబీపీ లేదా హైపర్టెన్షన్ సమస్యలు పెరగడానికి కూడా కాఫీ కారణమవుతుంది. కాఫీలో ఉండే కెఫిన్ బ్లడ్ ప్రెషర్ లో ఇబ్బందుల్ని కలిగిస్తుంది. కాబట్టి అతిగా కాఫీ తీసుకోవడం మంచిది కాదు.
డీహైడ్రేషన్ సమస్య:
కాఫీని తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య కూడా వస్తుంది. ఎక్కువగా కాఫీని తీసుకుంటూ నీళ్లు తాగకపోవడం లాంటి వాటి వల్ల డీహైడ్రేషన్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
అజీర్తి సమస్యలు:
కాఫీ అధికంగా తాగడం వల్ల అజీర్తి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఏదీ కూడా అతిగా తీసుకోవడం మంచిది కాదు ముఖ్యంగా కాఫీ అసలు ఎక్కువగా తీసుకోవద్దు. పరిమితి దాటి కాఫీని తీసుకుంటే తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.