దారుణం : చేతులు కట్టేసుకొని బావిలో దూకి లవర్స్ సూసైడ్ !

-

వరంగల్ అర్భన్ పోలీసుస్టేషన్ పరిధి లోని నక్కలపేల్లి గ్రామంలో ఓ ప్రేమ జంట వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఖిలా వరంగల్ మండలం నక్కలపల్లి గ్రామంలో వ్యవసాయ బావిలో ప్రేమ విఫలమైందని అదే గ్రామానికి చెందిన మన్నే సాయి మరియు మెదక్ జిల్లా కు చెందిన తాటిపాముల అశ్విని చేతులు కట్టేసుకుని మరీ దూకి మరణించారు. వారిద్దరూ గత కొన్నాళ్లుగా ప్రేమించుకున్నట్లు సమాచారం. కరోనా నేపథ్యంలో ఢిల్లీలో చదువుతున్న సాయి 6నెలల క్రితం ఇంటికి వచ్చి ఇక్కడే వుంటున్నాడు.

మధ్యాహ్నం ఇంట్లో నుండి బయలుదేరిన సాయి వ్యవసాయ భావిలో పడినట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కు చెందిన డిఆర్ఎఫ్ టీమ్ తో గాలింపు చర్యలు చేపట్టారు.  నాలుగు గంటలు శ్రమించి ఎట్టకేలకు మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఆత్మహత్య గురించి పోలీసులను వివరణ కోరగా సాయి తల్లిదండ్రులు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చురీకి ఈ ఇద్దరి మృత దేహాలను తరలించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version