తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే రాష్ట్రంలో మెట్రో రైళ్ల పై విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తు.. ఎల్ అండ్ టీ మెట్రో రైల్.. హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం ఈ పిటిషన్ పై హై కోర్టు విచారించింది. మెట్రో రైల్ పై విద్యుత్ ఛార్జీల పెంపు పై వివరణ ఇవ్వాలని డిస్కంలను హై కోర్టు ఆదేశించింది. అలాగే ఈ పిటిషన్ రేపటికి వాయిదా వేస్తు నిర్ణయం తీసుకుంది.
కాగ విద్యుత్ ఛార్జీల పెంపు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధమని మెట్రో రైల్ వాధించింది. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచింతే.. గత నాలుగేళ్లుగా నష్టాల్లో మెట్రో రైల్.. మరింత నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని హై కోర్టుకు తెలిపిందిజ. మెట్రో రైల్ పై విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల.. ఈ భారం ప్రయాణికులపై వేయాల్సి వస్తుందని వివరించింది. మెట్రో రైల్ పై విద్యుత్ ఛార్జీలు పెంచాలనే టీఎస్ ఈఆర్‌సీ ఉత్తర్వులను రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హై కోర్టును ఎల్ అండ్ టీ మెట్రో రైల్ కోరింది.