చెలరేగిన లక్నో.. కేకేఆర్‌ లక్ష్యం 211

-

ఐపీఎల్‌ సీజన్‌ 2022 దగ్గర పడుతున్న కొద్దీ జట్ల మధ్య ఆట రసవత్తరంగా సాగుతోంది. అయితే నేడు ముంబాయి డీవై పాటిల్‌ వేదికగా.. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో కలకత్తా నైట్‌ రైడర్స్‌ జట్టు తలపడుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లక్నో బ్యాటింగ్‌ ఎంచుకుంది. లక్నో ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌, కేఎల్‌ రాహుల్‌ చేలరేగడంతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 210 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. డికాక్‌ కేవలం 70 బంతుల్లోనే 140 పరుగులు సాధించి విధ్వంసం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లు ఉన్నాయి. ఇక కెప్టెన్‌ రాహుల్‌ 51 బంతుల్లో 68 పరుగులు సాధించాడు.

ఇదిలా ఉంటే.. ఒక్క‌టంటే ఒక్క వికెట్ కూడా న‌ష్ట‌పోకుండా పూర్తిగా 20 ఓవ‌ర్లు ఆడిన జ‌ట్టుగా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టు స‌రికొత్త రికార్డును సృష్టించింది. తాజా సీజ‌న్‌లోనే ల‌క్నో జ‌ట్టు అరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. తొలి సీజ‌న్‌లోనే స‌త్తా చాటుతున్న జ‌ట్టుగా ల‌క్నో ప్ర‌శంస‌లు అందుకుంటుండ‌గా…తాజాగా ఇప్ప‌టిదాకా ఏ ఒక్క జ‌ట్టుకు సాధ్యం కాని రికార్డును ఆ జ‌ట్టు కైవ‌సం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version