అమ్మకానికి చంద్ర ఉల్క.. జస్ట్ 2.49 మిలియన్ పౌండ్స్…!

-

ప్రపంచంలోని అతిపెద్ద చంద్ర ఉల్కలలో ఒకటి గురువారం అమ్మకానికి రానుంది. క్రిస్టీస్ వద్ద దాన్ని దాదాపు 2.49 మిలియన్ పౌండ్స్ కు దాన్ని విక్రయించనున్నారు. 13.5 కిలోల బరువున్న ఈ ఉల్క గ్రహశకలం లేదా తోకచుక్కతో ఢి కొట్టడంతో చంద్రుడి ఉపరితలం నుంచి సహరా ఎడారిపై పడింది. NWA 12691 గా పిలువబడే ఈ ఉల్క ఇప్పటి వరకు భూమి మీద పడిన 5వ అతిపెద్ద చంద్ర ఉల్క.

650 కిలోల మూన్ రాక్ కూడా మన భూమి మీద పడినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనిపై మాట్లాడిన క్రిస్టీ సైన్స్ అండ్ నేచురల్ హిస్టరీ విభాగ చీఫ్ జేమ్స్ హైస్లాప్ “మరొక ప్రపంచం యొక్క భాగాన్ని మీ చేతుల్లో పట్టుకున్న అనుభవం మీరు ఎప్పటికీ మరచిపోలేనిదన్నారు. “ఇది చంద్రుని యొక్క వాస్తవమైన భాగం. ఇది ఒక ఫుట్‌బాల్ పరిణామం కంటే కొంచెం పెద్దదని మనిషి తలకంటే పెద్దది అని పేర్కొన్నారు.

ఇతర ఉల్కల మాదిరిగానే సహారాలో గుర్తు తెలియని వ్యక్తి దీన్ని గుర్తించగా ఆ తర్వాత ఇది మరొకరి చేతిలోకి వెళ్లినట్టు ఆయన వివరించారు. అమెరికాలోని అపోలో అంతరిక్ష పరిశోధకులు కొందరు… ఇతర ఉల్కలతో పోల్చి చూడగా ఇది చంద్రుడి నుంచి వచ్చిందని అధికారికంగా గుర్తించారు. 1960 మరియు 1970 లలో అపోలో 400 కిలోగ్రాముల మూన్ రాక్‌ను గుర్తించారు. ఉల్కలు చాలా అరుదుగా భూమి మీద పడుతూ ఉంటాయి. వెయ్యిలో ఒక్కటి మాత్రమే పడుతుందని, దీనికి భూమి మీద చాలా విలువ ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version