నేడు సంపూర్ణ చంద్రగ్రహణం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఆదివారం రాత్రి 8.58 గంటలకు గ్రహణం ప్రారంభం కానుంది. 11 గంటల నుంచి 12.22 వరకు సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. సోమవారం తెల్లవారుజామున 2.25 గంటలకు గ్రహణం వీడనున్నట్టు చెబుతున్నారు. చంద్ర గ్రహణం సమయంలో మంత్రాలను జపించడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుందని పండితులు అంటున్నారు.

అలాగే ఆహాయ నియమాలు పాటించడం మంచిది. ఈ తరుణంలోనే.. భారత దేశంలోని పలు దేవాలయాలు మూతపడనున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం కూడా మూసివేయనున్నారు. 12 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేస్తారు. ఇవాళ సా 3:30 గంటల నుంచి రేపు ఉ 3 గంటలకు వరకు దర్శనాలు నిలిపివేస్తారు.
అటు నేడు శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేయనున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 1గంట నుండి రేపు సోమవారం ఉదయం 5 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఆలయ ద్వారాలు మూసివేస్తారు. చంద్రగ్రహణం రాత్రి 9:56 నిమిషాలకు ప్రారంభమై రాత్రి 1:26 నిమిషాలకు ముగుస్తుంది.
స్వామి అమ్మవార్ల ఆలయాలతో పాటు ఉప ఆలయాలైన సాక్షి గణపతి,హఠకేశ్వరం,పాలధార పంచదార,శిఖరేశ్వరం ఆలయాలు మూసివేయనున్నారు. సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ పూజలు నిర్వహించనున్నారు ఆలయ పండితులు. యాదాద్రి, వేములవాడ రాజన్న ఆలయాలు కూడా మూతపడతాయి.
- నేడు సంపూర్ణ చంద్రగ్రహణం..
- గ్రహణ ప్రారంభ సమయం రాత్రి 9.56
- మోక్ష కాలం అర్థరాత్రి 1.26
- భారత్ తో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరప్ దేశాల్లో కనిపించనున్న చంద్రగ్రహణం
- గ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల మూసివేత