నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం అన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే.. భారత దేశంలోని పలు దేవాలయాలు మూతపడనున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం కూడా మూసివేయనున్నారు. 12 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేస్తారు. ఇవాళ సా 3:30 గంటల నుంచి రేపు ఉ 3 గంటలకు వరకు దర్శనాలు నిలిపివేస్తారు.

అటు నేడు శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేయనున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 1గంట నుండి రేపు సోమవారం ఉదయం 5 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఆలయ ద్వారాలు మూసివేస్తారు. చంద్రగ్రహణం రాత్రి 9:56 నిమిషాలకు ప్రారంభమై రాత్రి 1:26 నిమిషాలకు ముగుస్తుంది.
స్వామి అమ్మవార్ల ఆలయాలతో పాటు ఉప ఆలయాలైన సాక్షి గణపతి,హఠకేశ్వరం,పాలధార పంచదార,శిఖరేశ్వరం ఆలయాలు మూసివేయనున్నారు. సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ పూజలు నిర్వహించనున్నారు ఆలయ పండితులు. యాదాద్రి, వేములవాడ రాజన్న ఆలయాలు కూడా మూతపడతాయి.