ఆ రాష్ట్రంలో లగ్జరీ ఇళ్లకు భారీ డిమాండ్..

-

దేశంలో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. మన తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో కొత్త ఇళ్ళకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. ఆ నగరాల్లొ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇళ్ల విలువ రెండున్నర రేట్లు అధికం అనే చెప్పాలి.ముంబై లో 10 కోట్లకు పై ఉన్న ఇళ్ళ ధరలు 2021 లో భారీగా పెరిగాయి.

ఈ సంవత్సరం డబల్ అయ్యాయని అంటున్నారు. రూ. 20,255 కోట్లు విలువైన యూనిట్లు అమ్ముడుపోయాయి. గృహ రుణాలపై కనిష్ట వడ్డీ రేట్లు ఉండడం పెద్ద ఇళ్లకు డిమాండ్ పెరిగింది.సోథెబి ఇంటర్నేషనల్‌ రియల్టీ, సీఆర్‌ఈ మ్యాట్రిక్స్‌ సంయుక్తంగా ఒక నివేదికను తాజాగా విడుదల చేశాయి. కరోనా మిగిల్చిన పరిస్థితుల వల్ల ధరలు రెట్టింపు అయినట్లు తెలుస్తుంది.

2020 లో ముంబైలో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు రూ.9,492 కోట్లు ఉండగా, అందులో ప్రైమరి, సెకండరీ ఇల్లు కలిసే ఉన్నాయి.ఒక లెక్క ప్రకారం చూస్తే ముంబైలో 1,214 యూనిట్ల లగ్జరీ ఇళ్లు సేల్ అయ్యాయి.ముంబైలోని వర్లి, లోయర్‌ పారెల్, బంద్రా, టార్డో, ప్రభాదేవి, అంధేరి ప్రాంతాలు లగ్జరీ ఇళ్లకు కెరాఫ్ గా ఉన్నాయి.

మొత్తం నగరం మీద చూసుకుంటే వర్లి ప్రాంతంలోనే విలాసవంతమైన ఇల్లు అధికంగా ఉన్నాయి.ఇక్కడే 20 శాతం ఇల్లు ఎక్కువగా అమ్ముడు పోతూన్నాయి.సెకండరీ ఇళ్ళ కన్నా కూడా ఎక్కువగా ప్రైమరి ఇల్లే ఎక్కువగా అమ్ముడు పొతున్నాయి. వాటికి డిమాండ్ రోజు రోజుకు రెట్టింపు అవుతుంది.ముంబైలో ఇల్లను కొనాలని భావించేవాళ్లు ఈ సమాచారం తెలుసుకోవడం బెటర్..

Read more RELATED
Recommended to you

Exit mobile version