హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు హీరో నితిన్. ప్రస్తుతం హీరో నితిన్ “మాచర్ల నియోజకవర్గం” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ను శేఖర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి నటిస్తుండగా.. శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై తెరకెక్కుతోంది.
“మాచర్ల నియోజకవర్గం” సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి హీరో నితిన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం.
ఈ సినిమాలో లో హీరోయిన్ నితిన్ కలెక్టర్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఇక ఫస్ట్ లుక్ విషయానికి వస్తే… నితిన్ ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. సినిమాలోని ఓ ఫైట్ సీన్ కు సంబంధించిన పోస్టర్ను ఫస్ట్ లుక్ లో విడుదల చేసింది చిత్రబృందం.
Its time to take my First Charge ✍️
Reporting as SIDDHARTH REDDY 😎
Meeku Nachhe , Meeru Mechhe
MASS tho Vastunaa :)))
#MacherlaNiyojakavargam🔥@IamKrithiShetty @CatherineTresa1 @SrSekkhar #SudhakarReddy #NikithaReddy #RajkumarAkella @SreshthMovies @adityamusic pic.twitter.com/7vaf5h9YjK— nithiin (@actor_nithiin) March 26, 2022