అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన మద్దాలి శివారెడ్డి అలియాస్ రవికిషన్..

-

పాన్ ఇండియన్ స్టార్ అల్లుఅర్జున్ అరెస్టుపై నటుడు, రాజకీయ నాయకుడు ఎంపీ రవికిషన్ స్పందించారు.రవికిషన్ గతంలో రేసుగుర్రం సినిమాలో బన్నీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అందులో విలన్ రోల్ చేసిన రవికిషన్ మద్దాలి శివారెడ్డి అనే క్యారెక్టర్ చాలా నేచురల్‌గా చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

తాజాగా ఆయన ఢిల్లీలో అల్లు అర్జున్ అరెస్టుపై స్పందిస్తూ.. తనకు బన్నీ మంచి ఫ్రెండ్ అని.. కో స్టార్ అని పేర్కొన్నాడు. జాతీయ అవార్డు పొందిన వ్యక్తిని.. అరెస్టు చేయడం సినీరంగానికి బ్లాక్ డే అని అభివర్ణించారు. అల్లు అర్జున్‌కు కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం ఫ్యాన్స్ ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఆయన్ను అరెస్టు చేసిందని, అరెస్టుకు గల పర్సనల్ అజెండా ఏంటో తెలుసుకోవాల్సిన అససరం ఎంతైనా ఉందని తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news