తెలుగుదేశం పార్టీలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి వెళ్లి ముఖ్యమంత్రి జగన్ ని కలవడం తెలుగుదేశం కార్యకర్తలను నేతలను కలవరపెడుతుంది. రాజకీయంగా బలహీనంగా ఉన్న తరుణంలో ఈ వ్యవహారాలూ అన్ని కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. వంశీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్తాను అని ప్రకటించారు.
అయితే మద్దాలి గిరి వెళ్లి జగన్ ని కలిసిన తర్వాత తెలుగుదేశం నేతలు ఆయనపై విమర్శలు చేసారు గాని ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. ఆయన మీద చంద్రబాబు కూడా పెద్దగా స్పందించలేదు. వెళ్లి జగన్ ని కలిసిన వెంటనే నియోజకవర్గ ఇంచార్జ్ ని ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు తన నుంచి పార్టీ అధిష్టానం వివరణ అడగకుండా ఈ విధంగా ఎలా చేస్తుంది అంటూ గిరి ఆశ్చర్యపోయారు.
ఇక కార్యకర్తల తన ఆఫీస్ వద్ద పార్టీ జెండాలను చించడం ఆయనను ఆశ్చర్యంలోకి నెట్టింది. దీనిపై గిరి స్పందించారు, ప్రస్తుతం తాను తెలుగుదేశంలోనే ఉన్నానని చెప్పిన ఆయన, ఫ్లెక్సీలు, చించుకొమనండి, తన చొక్కాలు కూడా చించుకోవాలన్నారు. తన ఇంటి మీద దాడి చేయమని రెచ్చగొడుతున్నార౦టూ ఆవేదన వ్యక్తం చేసారు. తన నియోజకవర్గ పనుల కోసమే ముఖ్యమంత్రి జగన్ ని కలిసా అని గిరి చెప్పుకొచ్చారు. అసలు గన్నవరంకి ఇంచార్జ్ ని నియమించకుండా తన నియోజకవర్గానికి ఎందుకు నియమించారు అని చంద్రబాబు వైఖరితో గిరి షాక్ అయ్యారు.