బెట్టింగ్ యాప్స్ కేసు పై అన్ని వివరాలు సేకరిస్తున్నాం : మాదాపూర్ డీసీపీ

-

మియాపూర్ బెట్టింగ్ యాప్స్ కేసు పై అన్ని వివరాలు సేకరిస్తున్నాం అని మాదాపూర్ డీసీపీ వినీత్ అన్నారు. ముందుగా యాప్స్ నిర్వహకులకు నోటీసులు పంపి వారి వివరణ తీసుకున్నాక దర్యాప్తు ముమ్మరం చేస్తాం. ఈ కేసులో పాన్ ఇండియా స్టార్స్ ఉన్న నేపథ్యంలో లీగల్ పరిణామాలను కూడా పరిశీలిస్తున్నాం. మోరల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా సినీ సెలబ్రిటీలు వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లూ ఎన్సర్స్ ని మియాపూర్ పోలీస్ స్టేషన్ కి పిలిపించబోతున్నాం. పాన్ ఇండియా స్టార్స్ తో యాడ్స్ రూపంలో షూట్ చేసి వివిధ ప్లాట్ ఫామ్స్ లో ప్రమోట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ నిర్వహకులు.

యూట్యూబర్స్ , సోషల్ మీడియా ఇన్ఫ్లు యన్సర్స్ వ్యక్తిగతంగా వివిధ సైట్లలో ప్రమోట్ చేయడమే కాకుండా వారి వ్యక్తిగత అకౌంట్లో కూడా బెట్టింగ్స్ యాప్ గురించి ప్రమోట్ చేశారు. అలా చేసిన వారిపైన చర్యలు తీసుకుంటాం. 2017 నుంచి తెలంగాణలో బెట్టింగ్స్ యాప్స్ పై నిషేధం ఉంది. బెట్టింగ్స్ యాప్స్ నిర్వహకులతో వీరు ఏ ఏ పద్ధతుల్లో ఒప్పందం కుదుర్చుకున్నారు అనేది తేల్చాల్సి ఉంది. ఈ కేసులో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి అని మాదాపూర్ డీసీపీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news