మైండ్ ట్రైనింగ్ కి తప్పక పాటించవలసిన టెక్నిక్స్ ఇవే..!

-

శారీరిక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యం కూడా ప్రతి ఒక్కరికి అవసరం. అయితే మీ మెదడు పనితీరు మెరుగ్గా ఉండాలంటే తరచుగా మైండ్ కు సంబంధించిన ట్రైనింగ్ ను ఇవ్వాలి. ఇలా చేయడం వలన ఏకాగ్రత పెరుగుతుంది. దాంతో రోజంతా ఎంతో చురుగ్గా పనిచేస్తారు. అయితే మీ మైండ్ కి ట్రైనింగ్ ఇవ్వాలంటే తప్పకుండా ఈ టెక్నిక్స్ ను పాటించాలి. దాంతో మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. మెదడు పనితీరు బాగుండాలంటే ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా ఉండాలి మరియు ఎలాంటి ఒత్తిడిను ఎదుర్కొన్నా సరే త్వరగా దానిని పరిష్కరించుకోవాలి. ఇలా చేయడం వలన రోజంతా ప్రశాంతంగా ఉండవచ్చు. దీంతో ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది.

చాలా శాతం మంది ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎంతో ఏకాగ్రత పెట్టి చేస్తూ ఉంటారు. కాకపోతే మొబైల్ ఫోన్ లో వచ్చేటువంటి నోటిఫికేషన్స్ వలన డైవర్ట్ అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా, ఈమెయిల్ వంటి నోటిఫికేషన్లు ఏకాగ్రతను తగ్గించేస్తాయి. దీంతో పనికి దూరం అవుతారు మరియు సమయాన్ని కూడా వృధా చేస్తారు. మీ మెదడు మీ కంట్రోల్ లో ఉండాలంటే తప్పకుండా లక్ష్యాలను పెట్టుకుంటూ ఉండాలి మరియు తరచుగా ఒక లక్ష్యం కోసం పనిచేయాలి. ఇలా చేయడం వలన మెదడు పనితీరు ఎంతో మెరుగ్గా ఉంటుంది. చాలా శాతం మంది ఎక్కువ పని చేయడం వలన ఎంతో ఒత్తిడికి గురవుతారు మరియు మెదడు పనితీరు కూడా తగ్గిపోతుంది.

అలాంటి సమయంలో ప్రతి 25 నిమిషాలకు ఒకసారి ఐదు నిమిషాలు విరామాన్ని తప్పకుండా తీసుకోవాలి. ఈ విధంగా విరామాన్ని తీసుకోవడం వలన మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది మరియు ఒత్తిడికి కూడా గురవ్వకుండా ఉంటారు. మీ మెదడు మీ కంట్రోల్ లో ఉండాలంటే తప్పకుండా సరైన నిద్ర కూడా ఎంతో అవసరం. ఎప్పుడైతే మంచి నిద్రను పొందుతారో మెదడు ఎంతో చురుగ్గా ఉంటుంది, ఏకాగ్రతతో పనులను కూడా పూర్తి చేస్తారు. కనుక తప్పకుండా ప్రతిరోజు రాత్రి సమయంలో 7 నుండి 9 గంటల వరకు నిద్రపోవాలి. ఇటువంటి టెక్నిక్స్ ను పాటించడం వలన మెదడు పనితీరు బాగుంటుంది మరియు మీ కంట్రోల్ లో ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news