పుత్రోత్సాహంలో నటుడు మాధవన్.. కొడుకు జాతీయ రికార్డు

-

ప్రముఖ నటుడు మాధవన్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. మాధవన్ కుమారుడు వేదాంత్ స్విమ్మింగ్ లో జాతీయ రికార్డు బద్దలు కొట్టడమే అందుకు కారణం. 16 ఏళ్ల జూనియర్ స్థాయిలో సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు వేదాంత్ . భువనేశ్వర్ లో జరుగుతున్న 48వ జాతీయ ఆక్వాటి క్ చాంపియన్ షిప్ పోటీల్లో 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ అంశంలో విజేతగా నిలిచాడు వేదాంత్ . గతంలో ఈ రికార్డు అద్వైత్ పగే (16.06 నిమిషాలు) పేరిట ఉండగా, వేదాంత్ (16.01 నిమిషాలు) దాన్ని సవరించాడు.

తన కుమారుడు జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో కొత్త రికార్డు నెలకొల్పిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు మాధవన్. “చేయలేనిదంటూ ఏదీ ఉండదు… 1500మీ ఫ్రీస్టయిల్ అంశంలో జాతీయ జూనియర్ రికార్డు బద్దలైంది” అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. మాధవన్‌ ట్వీట్‌ తన అభిమానులు వేదాంత్‌కు అభినందనలు తెలుపుతూ రిప్లైలు ఇస్తున్నారు. ఇటీవల మాధవన్‌ నటించిన రాకెట్రీ సినిమా రిలీజ్‌ అయ్యి అద్భుత విజయాన్ని అందుకున్న విజయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version