మందు కావాలా బాబు.. అయితే వ్యాక్సిన్ వేసుకోండి!

-

కొవిడ్-19 టీకా వేసుకోవడంపై కొంత మంది విముఖత వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు ఎంత మొత్తుకుంటున్నా వినిపించుకోవడం లేదు. ఈ కారణంగా టీకా పంపిణీ వేగవంతం కావడం లేదు. కొవిడ్-19 టీకా పట్ల విముఖ వ్యక్తం చేసేవారి దారికి తీసుకురావడం కోసం రేషన్ ఇవ్వమని, గ్యాస్ కట్ చేస్తామని హెచ్చరికలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లా యంత్రంగం ఓ అడుగు ముందుకేసింది. టీకా తీసుకుంటేనే మద్యం ఇస్తామని స్పష్టం చేసింది.

టీకా తీసుకోని వారిలో అత్యధిక మంది మందు బాబులే ఉంటున్నారు. వారిని దారికి తీసుకువచ్చేందుకు ఖాండ్వా జిల్లా ఎక్సైజ్ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. కొవిడ్-19 రెండు డోసులు తీసుకున్న ధ్రువీకరణ పత్రాన్ని సమర్పిస్తేనే మద్యం విక్రయించాలని వైన్‌షాపుల యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. టీకా తీసుకోని వారికి ఎట్టి పరిస్థితుల్లో మద్యం విక్రయించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఈ రకంగానైనా టీకాలు తీసుకోవడం పట్ల ఆసక్తి చూపుతారని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version