టిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి మధురై కోర్టు సమాన్లు జారీ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ పై కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలపై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీంతో కోర్టు సమాన్లు ఇష్యూ చేసింది. మాణిక్యం ఠాకూర్ పిసిసి పదవిని రూ.40 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపణలు చేశారు.
దీంతో మాణిక్యం ఠాకూర్ కౌశిక్ రెడ్డి పై మధురై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. పిటీషన్ విచారణకు స్వీకరించింది. పాడి కౌశిక్ రెడ్డి తరఫున ఎవరు హాజరు కాకుంటే వారెంట్ జారీ చేస్తామని వెల్లడించింది. రేవంత్ రెడ్డి ని పిసిసి చీఫ్ చేసేందుకు రూ.40 కోట్లు తీసుకున్నారని కౌశిక్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై అప్పటి తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ ఈ మేరకు పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి మదురై కోర్టు సమన్లు జారీ చేసింది.